వరి కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
కలెక్టర్ రాహుల్ రాజ్
నా తెలంగాణ, మెదక్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖరీఫ్ సీజన్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, వివో లు, టీఎస్ సీఎస్ చైర్మన్లు, సీఈఓ లు, రైస్ మిల్లర్స్ మండల అధ్యక్షులు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్స్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటుపై సమీక్షించారు. ఐకేపీ ద్వారా 387 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఫ్యాక్స్ ద్వారా 267, సివిల్ సప్లై 7, ఎఫ్ పీవో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సన్న రకం 44,534 హెక్టార్లలో సాగు చేసినట్లు,57,432 హెక్టార్లలో దొడ్డు రకం సాగు చేసినట్లు చెప్పారు . 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందన్నారు. లక్ష గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 109 రైస్ మిల్లులకు ఆను 66 మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. ఇతర జిల్లాలకు కూడా ధాన్యం తరలిస్తామన్నారు. రవాణ విషయలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తూకంలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ గ్రేడ్ రూ. 2320, సాధారణ రకం రూ. 2300 నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, డి ఎం సివిల్ సప్లై హరికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, డిసిఒ కరుణ, మార్కెటింగ్, రవాణా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.