నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: 17వ శతాబ్దంలోనే బ్రిటిష్ పాలకుల అరాచకాలను ఎదిరించి వారి నియంతృత్వంపై కత్తి దూసిన మహా యోధుడు వీరపాండ్య కట్ట బ్రహ్మన అని నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం కథలాపూర్ తుర్తి గ్రామంలో తుర్తి గ్రామంలో ముదిరాజ్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీరపాండ్య కట్ట బ్రహ్మన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అరాచకాలను పన్ను వసుళ్లను వ్యతిరేకించారన్నారు. అలాన్ సైన్యంతో కోటపై యుద్ధానికి వస్తే వారిని తరిమి కొట్టిన ఘనత వీరపాండ్యకే దక్కుతుందన్నారు. అలాంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వీరపాండ్య ధైర్యసహసాలను ప్రతీ ఒక్కరూ పునికి పుచ్చుకోవాలని నీలం మధు ముదిరాజ్ కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ నాయకులు పిట్టల వంశీ, నేమురి నరేష్, కథలాపూర్ ముదిరాజ్ మండల అధ్యక్షుడు నర్సయ్యపల్లి మధు, మాజీ సర్పంచ్ కొలకాని శేఖర్, మక్కం గంగబుమయ్య, ఆంజనేయులు, మక్కం భాస్కర్, పిసారి సురేష్, లక్ష్మణ్, రాజేష్, మునిరాజ్, యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.