సాంప్రదాయాలను భావితరాలకు అందిందాం

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు  2కే రన్ నిర్వహణ

Oct 9, 2024 - 19:31
 0
సాంప్రదాయాలను భావితరాలకు అందిందాం

నా తెలంగాణ, మెదక్: తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు భావితరాలకు చాటి చెప్పే విధంగా జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ విజయవంతం నిర్వహించినట్లు చెప్పారు. మెదక్ స్టేడియం  చౌరస్తా నుండి రాందాస్ చౌరస్తా వరకు టూ కె రన్ నిర్వహణ కార్యక్రమానికి హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఈ సంబరాల్లో  భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు 2కె రన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో పిల్లలకు వ్యాచారచన , క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని దసరా పండుగను తెలంగాణ ఆడబిడ్డలు పెద్ద ఎత్తున జరుపుకుంటారని  ఆ సంస్కృతిని మనం ఇంకా కొనసాగించే విధంగా ప్రచారం కల్పించే విధంగా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు . మహిళలకు బాలికలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.  తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి, వై దామోదర్ రెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి కే రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.