ఏచూరి మృతి తీరని లోటు
మెదక్ జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం
నా తెలంగాణ, మెదక్: సీపీఎం పార్టీ కీలక నాయకుడు సీతారాం ఏచూరి మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం అన్నారు. ఏచూరి మృతిపై గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. ఏచూరి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిరుపేదలకు సేవ చేస్తామన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె నర్సమ్మ, కె మల్లేశం, బస్వరాజు జిల్లా కమిటి సభ్యులు సంతోష్, నాయకులు సత్యనారాయణ, కొమురయ్య, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.