మోదీ హయాంలో బీసీలకు ప్రాధాన్యం

పూలేకు నివళులర్పించిన ఎంపీ లక్ష్మణ్

Apr 11, 2024 - 19:37
 0
మోదీ హయాంలో బీసీలకు ప్రాధాన్యం

నా తెలంగాణ, హైదరాబాద్: ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని ముషీరాబాద్, గాంధీ నగర్ డివిజన్ లో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జ్యోతిబాపూలే చిత్ర పటానికి పూలు వేసి అక్కడ ఏర్పాటు చేసిన ఆన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..బీసీల అభివృద్ధికి మోది ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

వెనుక బడిన వారి కోసం పని చేసేవారే నాయకులు అవుతారని చెప్పారు. కర్పూరీ ఠాకూర్, రైతు నాయకుడు చౌధరీ చరణ్ సింగ్ కి భారత రత్న ఇవ్వడం మోదీ గొప్ప తనమని లక్ష్మణ్ తెలిపారు. రాహుల్ గాంధీ బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని, 55 ఏళ్లు పాలించి బీసీ గణన చేయనందుకు రాహుల్ గాంధీ బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజకీయ లబ్ది కోసం పార్లమెంట్ ఎన్నికల వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు..మొదట రాష్ట్రంలో బీసీ గణన చేసి 44 శాతం బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఅర్ఎస్ కు పట్టిన గతే రేవంత్ సర్కార్ కు పడుతుందని హెచ్చరించారు.