డిగ్గీ కచ్చతీవు వ్యాఖ్యలపై రౌనౌత్ కౌంటర్
కడిగిన పారేసిన కంగనా
న్యూఢిల్లీ: కచ్చతీవులో ఎవరైనా నివసిస్తున్నారా? అని ఎంపీలోని రాజ్ గఢ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఢిగ్గీరాజా (దిగ్విజయ్ సింగ్) అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కాగా ఈ ప్రశ్నలపై సోషల్ మీడియా వేదికగానే సినీనటీ, ప్రముఖ నాయకురాలు కంగనా రౌనౌత్ డిగ్గీని కడికి పారేశారు. డిగ్గీ ప్రశ్నకు సమాధానంగా నెటీజన్లు గురువారం తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. డిగ్గీ గతంలోనూ పలు వివాదమయమైన ప్రకటనతో వార్లల్లో నిలిచారు.
కాగా ఈ ప్రకటనపై సినీనటి, ప్రముఖ రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. డిగ్గీపై ప్రశ్నల బాణాలు సంధించారు. కాంగ్రెస్ ఆలోచనా రీతిలో మార్పు వల్లే భారత్ లో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రస్తుతం భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతలోకి కూడా నల్ సే జల్ అందుతోందని స్పష్టం చేశారు. హిమాచల్ లోని పలు ఎత్తైన ప్రాంతాలకు కూడా రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేయడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు.
మరోవైపు డిగ్గీ రాజా విమర్శలను కంగనా కడిగి పారేశారు.
ఇటీవల కచ్చతీవు ప్రాంతంలో తరచుగా ప్రధానమోదీ తన ప్రసంగంలో ఉటంకిస్తున్నారు. అది భారత్ కు చెందిన ద్వీపమని నెహ్రూ కాలంలో ఒప్పందాల కారణంగా శ్రీలంకకు అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నానికి కారణమవుతోందని మండిపడడం తెలిసిందే.