మే 14న ప్రధాని నామినేషన్
13న ఎన్నికల ప్రచారం ప్రముఖులు హజరు మహిళా మోర్చా కీలక పాత్ర
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వారణాసీ లోక్ సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మే 14న నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రకటించింది. 13న మోదీ వారణాసిలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని శుక్రవారం తెలిపాయి. ఈ స్థానానికి జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
మోదీ నామినేషన్ సందర్భంగా మే 10 నుంచి వారణాసిలో దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలందరూ ఇక్కడకు చేరుకోనుండడం విశేషం. బహిరంగసభలు, ర్యాలీలు, సభలు, సమావేశాల్లో ఆయా నేతలు పాల్గొననున్నారు. మోదీ నామినేషన్ అనంతరం తమ తమ స్థానాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని రోడ్ షోను విజయవంతంగా చేసే దిశగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, జగదీష్ పటేల్ సమావేశాలు ప్రారంభించి నాయకులకు పలు సూచనలు, సలహాలు అందచేస్తున్నారు. మోదీ నామినేషన్ లో మహిళా మోర్చా కూడా కీలక పాత్ర వహించనుంది.