సనాతనాన్ని కించపరిచే వారికి బుద్ధి చెబుతాం

మోదీ ఆధ్వర్యంలో దేశాభివృద్ధికి పాటుపడతాం మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్​

May 3, 2024 - 17:53
 0
సనాతనాన్ని కించపరిచే వారికి బుద్ధి చెబుతాం

భోపాల్​: మోదీ హయాంలో సనాతన ధర్మాన్ని కించపరిచే వారికి బుద్ధిచెప్పేందుకే తాము ఉన్నామని మధ్యప్రదేశ్​ ముఖ్​యమంత్రి మోహన్​ యాదవ్​ అన్నారు. తన ప్రాంతంలో కేవలం 500మంది యాదవులు ఉన్నా ఆయన నన్ను ముఖ్యమంత్రిని చేశారని ఆయనకు బీసీ,ఎస్సీ, ఎస్టీ వర్గాలంటే ఎంత అభిమానమే ఇట్టే తెలుస్తోందని కొనియాడారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మోహన్​ యాదవ్​ గిన్నౌర్​ లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. నాలుగు రోజుల తరువాత ఇక్కడ ఓటింగ్​ జరగనుందని మతాన్ని కించపరిచే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మతం విషయంలో తాము ఎప్పుడూ రాజీపడబోమని తేల్చి చెప్పారు.

మోదీ నేతృత్వంలోని ‘సబ్​ కా సాథ్​ సబ్​ కా వికాస్​’ కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. యూపీలో గత ప్రభుత్వాలు వారి కుటుంబీకులనే సీఎంలను చేశాయి కానీ ఇతరులెవరినైనా చేశాయా? అని సీఎం మోహన్​ యాదవ్​ ప్రశ్నించారు.