ఢిల్లీలో 52.3 డిగ్రీలకు ఉష్ణోగ్రత హై అలర్ట్​ జారీ

నీటిని వృథా చేస్తూ రూ. 2వేలు జరిమానా ప్రతీ కుటుంబానికి రెండు బాకెట్ల నీరు పళ్ల రసాలనే తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

May 29, 2024 - 18:52
 0
ఢిల్లీలో 52.3 డిగ్రీలకు ఉష్ణోగ్రత హై అలర్ట్​ జారీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత 52.3 డిగ్రీలకు చేరింది. దేశంలో ఎక్కడా నమోదు కాని అత్యధిక ఉష్ణోగ్రతలు ఇవేనని ఐఎండీ బుధవారం స్పష్టం చేసింది. హై అలర్ట్​ ను జారీ చేసింది. ఢిల్లీలోని ముంగేష్​ పూర్​ లో మధ్యాహ్నం 52.3 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. జూన్​ 1వ తేదీ వరకూ మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లకుండా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యధిక ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వివరించింది. మరోవైపు తీవ్ర వేడిమి వల్ల ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. 

ఇంకోవైపు నీటిని వృథా చేస్తూ రూ. 2 వేలు జరిమానాను విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాలను కడగరాదని, ట్యాంకులు నిండాక వృథాగా నీరు పోనీయరాదని స్పష్టం చేసింది. మరోవైపు ప్రజలు నీటికోసం గంటల తరబడి ట్యాంకర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలో సైతం నీటి కోసం గంటలసేపు వేచి చూస్తున్నారు. నీటి కొరత ఏర్పడిన ప్రాంతాల్లో ప్రతీ ఒక్క కుటుంబానికి కేవలం రెండు బకెట్ల నీరునే ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. 

వేడిగాలుల వల్ల ప్రజల అనారోగ్యానికి కారణమవుతాయని అప్రమత్తంగా ఉండాలని చల్లటి పానీయాల కంటే పళ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.