క్రీడాకారులకు ప్రధాని అభినందనలు

మోదీతో భేటీ అయిన పారిస్​, టోక్యో ఒలింపిక్స్​ క్రీడాకారులు

Sep 12, 2024 - 17:31
 0
క్రీడాకారులకు ప్రధాని అభినందనలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పారిస్​ పారా ఒలింపిక్స్​ లో చరిత్ర సృష్టించిన అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూ ఢిల్లీలో కలిశారు.  ఈ ఒలింపిక్స్​ లో భారత్​ 29 పతకాలు సాధించి 18వ స్థానంలో నిలిచింది. క్రీడాకారులు, కోచ్​ లను అభినందించారు.  క్రీడాకారులతో సరదాగా సంభాషించారు. పతకాలు సాధించిన, ఒలింపిక్స్​ లో పాల్గొన్న వారితో మాట్లాడారు. పలువురు క్రీడాకారులకు తన ఆటోగ్రాఫ్​ ను అందించారు. 
పారిస్​ పారా ఒలింపిక్స్​ లో భారత్​ ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో సహా 29 పతకాలు సాధించింది. 
టోక్యో పారా ఒలింపిక్స్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. టోక్యోలో భారత్ 19 పతకాలు సాధించి పతకాల సాధించి 24వ స్థానంలో నిలిచింది. 
 
క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.30 లక్షలు మంత్రి మన్సూఖ్​ మాండవీయా అందజేశారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.22.5 లక్షలతో సత్కరించారు.
 
క్రీడాకారులను ప్రధాని కలిసిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు క్రీడాశాఖ మంత్రి మన్సూఖ్​ మాండవీయా, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పిసిఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝరియాలు పాల్గొన్నారు.