రాడికల్ ఇస్లామిస్టులతో కలిసి అలజడికి పన్నాగం?
ఆ ముగ్గురు దేశానికి ప్రమాదకరమే
విదేశాల్లో రాహుల్ పిల్ల చేష్ఠలు
దేశ శాంతి, సుస్థిరతలకు ప్రమాదమే
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో హిందుత్వ వ్యతిరేక శక్తులతో కలిశారు. ఆయా వ్యక్తులు పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్ పై విషం గక్కారు. అంతేగాక హిందూమతం అసమానతలను రేకెత్తిస్తుందన్నారు.
రాహుల్ బాబా యూఎస్ పర్యటనలో ఇల్హాన్ ఒమర్, రోఖన్నా, బార్బరా లీ, ఇతర చట్టసభ సభ్యులతో కలిశారు. వీరంతా భారత వ్యతిరేకులుగా ముద్రపడ్డ వారే కావడం గమనార్హం.
ఇల్హాన్ ఒమర్..
ఇల్హాన్ ఒమర్. రాడికల్ ఇస్లామిస్ట్ గా పేరు పొందింది. ఈమె అమెరికాలోని మిన్నెసోటా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యింది. సోమాలియా దేశానికి చెందిన ఒమర్ శరణార్థిగా అమెరికాలో ఆశ్రయం పొంది పౌరసత్వం దక్కించుకొని చట్టసభలో అడుగిడింది. పలుమార్లు యూఎస్ ప్రతినిధుల సభలో కశ్మీర్ అంశాన్ని పాక్ కు అనుకూలంగా లేవనెత్తి భారత్ ఆగ్రహానికి గురైంది. అంతేగాక భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అసత్యాలు ప్రచారం చేసింది. ఈమెకు పాక్ లోని పలు ఉగ్రసంస్థల నాయకులతో సంబంధాలున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
రోఖన్నా..
యూఎస్ డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా. భారతీయ సంతతి అమెరికన్ రాజకీయ నాయకుడు. భారతదేశ అంతర్గత రాజకీయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. భారత్ వ్యవహారశైలిపై అమెరికా చట్టసభలో ఇల్హాన్ వాదనలకు బలం చేకూరుస్తుంటాడు. రాహుల్ అనర్హత వేటుపై కూడా భారత్ పై, ప్రజాస్వామ్యంపై పలుమార్లు విమర్శలు చేశాడు. అంతేగాక ప్రధాని మోదీపై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు.
బార్బరా లీ..
బార్బరా జీన్ లీ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి యూఎస్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. పలుమార్లు భారత వ్యతిరేక శక్తులతో కలిసి మోదీపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. మోదీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ పలుమార్లు నిరసన వ్యక్తం చేస్తూ లేఖలు కూడా రాశారు. మోదీకి విందు ఇవ్వొద్దన్నారు. ఆయనతో క్లిష్టమైన సమస్యలపై చర్చించాలని అధ్యక్షుడు బైడెన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మిగతా కొంతమంది దేశ వ్యతిరేక నాయకులతో కూడా రాహుల్ కలిశారు. వీరిందరిలో పై పేర్కొన్న వీరు ముగ్గురు భారతదేశానికి తీవ్ర వ్యతిరేకులుగా ముద్ర పడ్డారు. ఇలాంటి వారిని రాహుల్ గాంధీ (బాబా) కలుసుకొని యూఎస్ లో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న పిల్ల చేష్ఠల వల్ల దేశ శాంతి, సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే వాదనలు వినబడుతున్నాయి.