ఉక్రెయిన్​ లో శాంతి కోసం స్వీస్​ లో సదస్సు

50 దేశాలకు ఆహ్వానాలు

Jun 15, 2024 - 20:10
 0
ఉక్రెయిన్​ లో శాంతి కోసం స్వీస్​ లో సదస్సు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉక్రెయిన్​ లో శాంతి కోసం స్విట్జర్లాండ్​ లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు 50 దేశాలకు శనివారం ఆహ్వానాలు అందాయి. ఈ సదస్సుకు రష్​యాను ఆహ్వానించలేదు. స్విట్జర్లాండ్​ లోని బర్గెన్​ స్టాక్​ రిసార్ట్​ లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఈక్వెడార్​, ఐవరీకోస్ట్​,కెన్యా, సోమాలియా, ఉక్రెయిన్​, అమెరికా, బ్రెజిల్​, దక్షిణాఫ్రికా, భారత్​ తదితర దేశాలు పాల్గొననున్నాయి.  కాగా భారత్​, దక్షిణాఫ్రికాలు ఈ సదస్సులో పాల్గొన్నా దిగువ స్థాయిలో ప్రాతినిధ్యం వహించనున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి హాజరయ్యే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్​ ఈ సదస్సులో కీలకపాత్ర పోషించనున్నారు.