గణేష్ మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన

Kumkumarchana at Ganesh Mandapam

Sep 12, 2024 - 16:55
 0
గణేష్ మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: క్యాతన పల్లి పురపాలకం రామకృష్ణాపూర్ ఒకటో వార్డు తారకరామ కాలనీ తారక గణేష్ మండలి యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం వినాయకునికి విశేష పూజలతో పాటు మహిళలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కుంకుమార్చన మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహనికి‌ కాలనీవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిట్టంపల్లి శ్రీనివాస్ తిరుపతి, నవీన్, సతీష్, శ్రీనివాస్, కిరణ్, వెంకటేష్, రాములు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.