ఇరాన్​ చమురు నౌకా సంస్థలపై అమెరికా నిషేధం

US ban on Iranian oil shipping companies

Dec 4, 2024 - 18:00
 0
ఇరాన్​ చమురు నౌకా సంస్థలపై అమెరికా నిషేధం

35లో రెండు భారత సంస్థలపై కూడా నిషేధం!
సిరియాకు మద్ధతుగా నిలవడమే కారణమా? 
అణు కార్యక్రమాలు అడ్డుకునేందుకా?

వాషింగ్టన్​: ఇరాన్​ చమురు కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది. 35 సంస్థలపై విధించిన నిషేధంలో రెండు భారత సంస్థలు కూడా ఉన్నాయి. భారత్​ కు చెందిన విజన్​ షిప్​ మేనేజ్​ మెంట్​ (ఎల్​ ఎల్​ పీ), టైట్​ షిప్​ షిప్పింగ్​ మేనేజ్​ మెంట్​ (ఓపీసీ) ప్రైవేట్​ లిమిటెడ్​ లపై నిషేధం విధించింది. దీంతోపాటు యూఎఈ, చైనా, లైబీరియా, హాంకాంగ్​ లకు చమురు సరఫరా చేసే సంస్థలు, నౌకలపై ఈ ఆంక్షలను విధించారు. సిరియాతో జరుగుతున్న యుద్ధంలో వారికి సహకరిస్తున్నందున అమెరికా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. దీంతో తమకు తామే ఇస్లాంకు పెట్టని కోటగా ప్రకటించుకుంటున్న ఇరాన్​ పై ఆర్థిక భారం మరింత పెరగనుంది. హమాస్​, హిజ్బుల్లా ఉగ్రవాదులకు సహకరిస్తూ ఆయుధాలను సరఫరా చేస్తున్న ఇరాన్​ పై అమెరికా పంజా విసిరినట్లయ్యింది. ఇరాన్​ అణు కార్యక్రమాలు, ఆయుధ తయారీ చేపట్టాలంటే ఆర్థికంగా పటిష్ఠం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరాన్​ అణు కార్యక్రమాలు మరో పదేళ్లు వెనక్కి వెళ్లినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇస్లామిక్​ దేశాలకు అణు సామర్థ్యాలు సొంతం అయితే పెనుముప్పు వాటిల్లదని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.