గురువుల పాత్ర ఎనలేనిది దేశ ప్రజలకు ప్రధాని, కేంద్రమంత్రి గురుపూర్ణిమ శుభాకాంక్షలు
Prime Minister and Union Minister wish the people of the country on Gurupurnima
నా తెలంగాణ, హైదరాబాద్: దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం గురుపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడని అన్నారు. సారనాథ్ లో పౌర్ణమి రోజే బుద్ధుడు ప్రపంచానికి విలువైన ఉపన్యాసాన్ని ఇచ్చారన్నారు. దేశ ప్రజలను సన్మార్గంలో తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. వారి సేవలను కొనియాడారు.
మార్గనిర్దేశకులు గురువులు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
గురువులే ప్రపంచానికి మార్గనిర్దేశకులని, దేశ యువత భవిష్యత్ ను సురక్షితంగా తీర్చిదిద్దుతున్న మహానీయులని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం గురుపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు గురుపూర్ణిమ మహోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంప్రదాయ, విద్య ఇలా అనేక రకాలై జ్ఞాన సంపదను ప్రతీఒక్కరూ తమ గురువుల ద్వారానే పొంది సముపార్జన సాధించగలరన్నారు. తద్వారా దేశ, సమాజ భవిష్యత్ నూతనంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులు అవుతున్నారని తెలిపారు.