బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్​ పురస్కారం

అభినందనీయమన్న కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jul 25, 2024 - 13:34
Jul 25, 2024 - 13:36
 0
బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్​ పురస్కారం

నా తెలంగాణ, హైదరాబాద్​: భారత ఒలింపిక్​ క్రీడాకారుడు 10మీటర్ల ఎయిర్​ రైఫిల్​ ఈవెంట్​ లో స్వర్ణ పతక విజేతకు ఒలింపిక్​ లో అత్యుత్తమ సేవలందించినందుకు గాను అభినవ్​ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ ఒలింపిక్​ ఆర్డర్​ అత్యున్నత పురస్కారాన్ని అందించడం పట్ల తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 

ఈ అవార్డును ఒలింపిక్స్​ ముగింపు ఆగస్టు 10న పారిస్​ లో అభినవ్​ బింద్రాకు అందజేయనున్నారు. 

2008లో ఎయిర్​ రైఫిల్​ లో బింద్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. అంతేగాక భారత క్రీడాకారుల విజయానికి, క్రీడల ప్రోత్సాహానికి గణనీయమైన కృషి చేశారు. భారతదేశం తరఫున తొలిసారిగా ఒలింపిక్​ లో బంగారు పతకం విజేతగా నిలిచారు. అభినవ్​ బింద్రా ఫౌండేషన్​ స్థాపించారు.