ఏకత్వాన్ని విభజించే కుట్రలను తిప్పికొడతాం

కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

Nov 15, 2024 - 15:00
 0
ఏకత్వాన్ని విభజించే కుట్రలను తిప్పికొడతాం

నా తెలంగాణ, హైదరాబాద్​: భారతీయ సంస్కృతికి సంబంధించిన ఏకత్వాన్ని విభజించాలని కుట్రలు చేస్తున్న దుష్ట శక్తులను తిప్పికొట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. శుక్రవారం బేగంపేట్​ లోని లోకమంథన్ భాగ్యనగర్‌ – 2024లో పాల్గొని విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచంలోని సమస్యలపై చర్చ జరిపి వాటి పరిష్కారాలకు మార్గం చూపడమే లోక్​ మంథన్​ ముఖ్యోద్దేశ్యమని సరైన సమయంలో రాజకీయాలకు అతీతంగా లోక్​ మంథన్​ జరగడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ లో ఈ ఏడాది లోక్ మంథన్ జరగడం సంతోషకరమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. శిల్పాకళా వేదికలో ఈ నెల 21 నుంచి 24 వరకు లోక్​ మంథన్​ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. ఇందులో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను వెంకయ్యనాయుడు, లోక్ మంథన్ ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రారంభిస్తారని తెలిపారు. ముగింపు సమావేశంలో మోహన్ భగవత్ సహా పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.