నేడు అంబర్‌పేటలో బీజేపీ బహిరంగ సభ
BJP Vijaya Sankalpa Yatra's concluding meeting will be held in Amberpet today
నా తెలంగాణ, హైదరాబాద్: బీజేపీ విజయసంకల్పయాత్ర లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో హిమాయత్‌నగర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఆలయ సందర్శన, ఆయిల్ సీడ్స్ కాలనీ, చంద్రానగర్, సంజయ్‌గాంధీ కాలనీ (స్కైలైన్), విజయాడయాగ్నస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్ లోని స్ట్రీట్ నెం.2, స్ట్రీట్ నెం.15 సందర్శించారు. గాంధీ కుటీర్, హరివిహార్ కాలనీ, మెల్కోటే పార్క్, ఉర్దూ హాల్ లైన్, ముత్యాల బాగ్, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ (ఎస్బీఐ) లైన్, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్, వాటర్ వర్క్స్, రాజమోహల్లా, పద్మశాలి భవన్, షంషీర్బాగ్, తారకరామా లైన్, రామారావు బస్తీ, వైఎంసీఏ వరకూ సాగనుంది.
మధ్యాహ్నం రెండు గంటలకు అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వైఎంసీఏ, రెడ్డి మహిళా కళాశాల, లింగంపల్లి చౌరాస్తా, రాఘవేంద్ర మఠం, ఛాదర్ ఘాట్, నింబోలీ అడ్డా, శ్యాంబాబా మందిర్, టూరిస్ట్ హోటల్, బర్కత్ పురా చమన్, ఫీవర్ హాస్పిటల్, తిలక్‌నగర్ రోడ్, ఇంద్రానగర్, గోల్నాక కూరగాయల మార్కెట్, గోల్నాక చౌరాస్తా, లక్ష్మీటాకీస్ చౌరస్తా, జిందా తలిస్మాత్ రోడ్, 6 నెంబర్ చౌరాస్తా, శివం రోడ్, డీడీ కాలనీ, అయ్యప్ప టెంపుల్, జాంజాం మసీదు, పాముల బస్తీ, గజానంద్ గడ్డ, భరత్‌నగర్ కమ్యూనిటీ హాల్, రామకృష్ణానగర్ రోడ్, మల్లిఖార్జున నగర్, వినాయఃకనగర్ చౌరాస్తా, అంబర్పేట్ మెయిన్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజీ రోడ్, బాపూనగర్ చౌరాస్తా, చెన్నారెడ్డి నగర్, న్యూ పటేల్ నగర్, ప్రేమ్‌నగర్, జ్యోతిరావు పూలే విగ్రహం, వడ్డెర బస్తీ, జైస్వాల్ గార్డెన్, అంబర్పేట్ పోలీస్ స్టేషన్, శ్రీరమణ థియేటర్ చౌరాస్తా మీదగా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అంబర్పేట్ మహంకాళీ దేవాలయం వద్ద జరిగే బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.