MODI: బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ల మధ్య చీకటి బంధం

Prime Minister Narendra Modi said that there is a strong dark nexus between BRS and Congress parties

Mar 5, 2024 - 14:09
 0
MODI: బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ల మధ్య చీకటి బంధం
  • ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు: మోదీ

  •  వీటి అవినీతి బంధం గురించి అందరికీ తెలుసు

  •  కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది

  •  కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ వేల కోట్లు దోచుకుంది

  •  కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ దాచిపెడుతోంది

  •  కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగిందని తెలిసినా కాంగ్రెస్ మౌనం ఉంది

  •  కుటుంబ పార్టీల అవినీతి బయటపెడుతున్నందుకే నాపై విమర్శలు

  •  తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది

  •  ఇక్కడి ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను

  •   అభివృద్ధి రూపంలో చూపిస్తానని భరోసా

  •  పటాన్​ చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని కామెంట్స్​

నా తెలంగాణ, పటాన్​ చెరు​: బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీల మధ్య బలమైన చీకటి బంధం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి గల రెండు ముఖాలు అని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది. దీని గురించి ప్రపంచం అంతా తెలుసు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ వేల కోట్లు దోచుకున్నది. కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ దాచిపెడుతోంది. 
కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగిందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ మౌనం ఉంది. చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసింది. రు తిన్నారు.. మేం కూడా తింటాం  అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట.. ఝూట్‌.. లూట్‌(అబద్ధాలు.. దోపిడీ)’’ అని మోదీ విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధి..

తెలంగాణ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపిన ప్రధాని మోదీ.. ఇక్కడి ప్రజల ప్రేమను తెలంగాణ అభివృద్ధి రూపంలో చూపిస్తానని వెల్లడించారు. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. విదేశాల్లో మనవాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బాగా ఆదరిస్తున్నారు. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను, ఇది మోదీ గ్యారంటీ. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడు. మోదీ గ్యారంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారంటీ. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాం. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను మార్చుతాం. భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలి”అని మోదీ పేర్కొన్నారు. 



ప్రజలే నా కుటుంబం

కొందరు నాయకులు గిఫ్ట్ లు తీసుకొని ఖజానా నింపుకుంటున్నారని మోదీ విమర్శించారు. ‘‘అలాంటి వారి దొంగసొత్తును బయటకు కక్కిస్తున్నాం. కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు కట్టించారు. మేము మాత్రం దేశంలో పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించాం. అందుకే నాకు కుటుంబం లేదంటూ కొందరు నేతలు విమర్శిస్తున్నారు.140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమే. ఇండి కూటమికి ఇది అర్థం కావడంలేదు. తాము మోదీ కుటుంబ సభ్యులమని ప్రజలందరూ అంటున్నారు”అని మోదీ తెలిపారు.

అభద్రతలో కుటుంబ పార్టీలు

దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీల పాలన కొనసాగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న చోట వారి కుటుంబాలే బాగుపడ్డాయి. కుటుంబపార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?. వారసత్వ రాజకీయాలను నేను వ్యతిరేకిస్తున్నాను. కుటుంబపార్టీల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ నాపై విమర్శలు చేస్తోంది. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రత భావం పెరిగింది. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖాజానాను నింపుకుంటున్నారు. కుటుంబ పాలకుల అవినీతిని వెలికితీస్తున్నాం. ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వను. అయోధలో రామమందిరం నిర్మిస్తామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరిగింది”అని మోదీ వెల్లడించారు.