మెదక్ లో హైకోర్టు న్యాయమూర్తి పర్యటన
Visit of High Court Judge in Medak
నా తెలంగాణ, మెదక్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి శనివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయసేన్ రెడ్డి పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఉదయం10 గంటలకు మండల కేంద్రమైన అల్లాదుర్గం చేరుకొని కోర్టు కాంప్లెక్స్ ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి మెదక్ బార్ అసోసియేషన్ తో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం పాల్గొంటుందని ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకుంటామని లక్ష్మీ శారద తెలిపారు.