భారీ వర్ష సూచనపై అలర్ట్​

ప్రజారోగ్యంపై అధికారులకు ఆదేశాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్​ రాహుల్​ రాజ్​

Aug 31, 2024 - 15:44
 0
భారీ వర్ష సూచనపై అలర్ట్​

నా తెలంగాణ, మెదక్​: రానున్న 72 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతను పాటిస్తూ, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. వైరల్​ ఫీవర్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉంచకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఆయా విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. సీజన్​ వ్యాధుల విజృంభణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాత ఇళ్లు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.