రాష్ట్రపతికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Prime Minister Modi's birthday wishes to the President

Jun 20, 2024 - 13:04
 0
రాష్ట్రపతికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ ప్రయాణం కోట్లాది మందికి ఆదర్శప్రాయమని, ఆమె అనుసరిస్తున్న మార్గం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రాష్ట్రపతి జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛమిచ్చి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి రాష్ట్రపతి అంకితభావం, ఆదర్శప్రాయమై సేవ ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. నిరుపేదలకు, అట్టడుగు వర్గాలకు మూర్మూ సేవలు మరువలేనివన్నారు. వారికి మేలు చేయడంలో ఆమె తన ప్రాధాన్యతను నిరూపించుకుంటున్నారని కొనియాడారు. రాష్ట్రపతి అలుపెరుగని సేవ, కృషికి దూరదృష్టి నిర్ణయాలకు భారత్​ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుందని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.