రాష్ట్రపతికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
Union Minister Kishan Reddy's birthday wishes to the President
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ ప్రజానీకానికి మార్గదర్శకురాలిగా నిలుస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాష్ట్రపతి జన్మదినం సందర్భంగా ఆమెను కలిశారు. సమన్యాయంతో సన్మార్గంలో నడుస్తూ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అధ్యక్షురాలి సేవలను కొనియాడారు. భగవంతుడు రాష్ట్రపతికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు.