గానామృతం మనసులను కదిలించేది

నైటింగేల్​ ఆఫ్​ ఇండియాకు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి నివాళులు

Sep 28, 2024 - 12:31
 0
గానామృతం మనసులను కదిలించేది

భారతీయ నైటింగేల్​​ ఇండియా (లతా మంగేష్కర్​) జయంతి సందర్భంగా తెలంగాణ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి ఆమె గానామృతాన్ని కొనియాడారు. ఆమెకు నివాళులర్పించారు. 70యేళ్లుగా ఆమె స్వరం భారతీయులే గాకుండా ప్రపంచంలోని ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుందన్నారు. ఆమె కళారంగానికి సహకారం భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఆమె పాటల ద్వారా ఎంతోమంది హృదయాలు సైతం కరిగిపోయేవని, ఆమె గొంతులో నుంచి స్వరం వినపడిందంటే అది తప్పక ప్రతీఒక్కరి మనసుల్లో నిలిచిపోయేదని గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్​ కు భారతరత్న ద్వారా సన్మానం దేశానికి గర్వకారణమన్నారు.