సికార్ లో రోడ్డు ప్రమాదం 12మంది మృతి
36మందికి తీవ్ర గాయాలు
జైపూర్: రాజస్థాన్ లోని సికార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 36మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మణ్ గఢ్ జిల్లా పోలీసు సూపరింటండెంట్ భువన్ భూషణ్ వివరాల ప్రకారం మంగళవారం సాలాసర్ నుంచి వస్తున్న బస్సు అతివేగంగా కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలకు రంగంలోకి దిగి తీవ్ర గాయాలైన వారిని లక్ష్మణ్ గడ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం 2 గంటలకు జరిగినట్లు అధికారులు వివరించారు. ఈ ప్రమాదంపై సీఎం భజన్ లా శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్త చేశారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు.