ఉభయ సభలు రేపటికీ వాయిదా
Both houses adjourned till tomorrow
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే రాహుల్ గాంధీ, కూటమి నేతలు, అదానీ, మణిపూర్, ఈవీఎంలు తదితర అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. సభలోనే పెద్ద యెత్తున నినాదాలు చేశారు. దీంతో లోక్ సభ స్పీకర్ పలుమార్లు సమావేశాలను సజావుగా జరగనీయాలని అన్ని అంశాలపై చర్చ జరుతుందన్నారు. అయినా కూటమి నేతలు, కాంగ్రెస్ నాయకులు నిరసనలు తగ్గకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనే ఇదే అంశం కుదిపేయడంతో ఉపరాష్ర్టపతి జగదీప్ ధంకర్ సభను 28కి వాయిదా వేశారు.
సభకు ఆటంకాలు కల్పించడంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిరసనల తీరు సరికాదన్నారు. సోషల్ మీడియాఓ అసభ్యకరమైన కంటెంట్ ను తనిఖీ చేసే చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపోని ఆరోపణల ద్వారా దేశ ప్రతిష్ఠను కూడా తాకట్టుపెట్టేవిధంగా పలువురు సోషల్ మీడియా ద్వారా వ్యవహరించడాన్ని వైష్ణవ్ తీవ్రంగా ఖండించారు.