సరిహద్దు నుంచి ఇరుదేశాల భద్రతా బలగాలు వెనక్కు
The security forces of both countries have withdrawn from the border
శ్రీనగర్: భారత్–చైనా దేప్సాంగ్ డెమ్ చోక్ సరిహద్దు నుంచి ఇరుదేశాల సైనికులు పూర్తిగా వెనక్కి వెళ్లారు. తాత్కాలిక నిర్మాణాలను కూడా తొలగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రక్షణ శాఖ మీడియాకు మంగళవారం విడుదల చేసింది. భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఎ) నియంత్రరేఖ నుంచి వెనక్కు తగ్గడాన్ని ధృవీకరించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ 10రోజులుగా కొనసాగుతుందన్నారు. క్రమేణా సరిహద్దులో పూర్తి శాంతియుత పరిస్థితులు నెలకొనాలనేదే తమ ముఖ్యోద్దేశ్యమన్నారు. అదే సమయంలో సరిహద్దు భద్రతపై నిఘా వేసి ఉంచుతామని, మరోవైపు చైనా కూడా తమ సరిహద్దుపై నిఘా వేసి ఉంచుతుందన్నారు. కాగా గాల్వాన్ లోని నాలుగు బఫర్ జోన్ లపై ఇంకా చర్చలు జరగలేదు. ఈ ప్రాంతంపై కూడా త్వరలోనే చర్చలు జరిగి ప్రశాంతవాతావరణాన్ని పునరుద్ధరిస్తామన్నారు. సరిహద్దుపై ఇరుదేశాల మిలిటరీ కమాండర్లు ప్రతీరోజూ చర్చలు జరుపుతూ ఇక్కడి భద్రతను సమీక్షిస్తున్నారు.