కూటమిలో అందరూ ప్రధాని అభ్యర్థులే
మోదీనే ఆశీర్వదించనున్న దేశ ప్రజలు బీజేపీ నేత ముక్తార్ అబ్బార్ నఖ్వీ
లక్నో: భారత కూటమిలో అందరూ ప్రధాని అభ్యర్థులేనని ఆ నేతలే తమ నాయకుడు ప్రధాని అంటే, తమ నాయకుడే ప్రధాని అభ్యర్థి అని చెప్పుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఆదివారం నఖ్వీ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఇండి కూటమిలో సీట్ల గోల తేలలేదన్నారు. అందుకే ఆయా పార్టీల నేతలు వలస వెళుతున్నారని తెలిపారు. ప్రతీ ఒక్క పార్టీ అధినేతకు ప్రధాని కావాలనే ఆశలు ఉన్నాయని కూటమి గెలుస్తుందని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఎన్నికల తరువాత చాలా పార్టీలు తమ ఉనికినే కోల్పోనున్నాయన్నారు. ప్రధాని మోదీ ద్వారా దేశంలో సుపరిపాలన అందుతుంటే ఇండికూటమి పార్టీ నేతలు చూసి ఓర్వజాలడం లేదని మండిపడ్డారు. దేశంలో ప్రజా ఆశీర్వాదం స్పష్టంగా మోదీకి లభిస్తున్నట్లు తేటతెల్లమైందని నఖ్వీ అన్నారు.