పీవోకే స్వాధీనమా? చర్చలా?

Possession of PVK? Discussion?

Oct 4, 2024 - 13:22
 0
పీవోకే స్వాధీనమా? చర్చలా?
పాక్​ లో ఉగ్రవాదంపై ప్రపంచదేశాల మౌనం
మోదీ ప్రభుత్వ అంతర్జాతీయ విధానంతో ఏక్​ నిరంజన్​ గా పాక్​
కాశ్మీర్​ పీవోకే స్వాధీనానికి సరైన సమయం
బలమైన నిర్ణయాలతో ప్రపంచదేశాల్లో భారత్​ పై మారిన వైఖరి
ఉగ్రవాద చర్యలతో ఏకాకిగా పాక్​
యూఎన్​ ను ఇరకాటంలోకి నెడుతున్న ఇజ్రాయెల్​ చర్యలు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఓ వైపు ప్రపంచంలో యుద్ధ వాతావరణం.. మరోవైపు ఉగ్రవాద దాడుల బెడద వెరసీ ఐక్యరాజ్యసమితికి చిర్రెత్తిస్తోంది. ఆంగ్లేయులు పాలించిన ప్రతీ దేశంలోనే వెళుతూ..వెళుతూ.. ఏదో ఒక మెలిక పెట్టి సుసంపన్నంగా ఉన్న దేశాలను విచ్ఛిన్నం చేసే కుట్రలకు ఫలితాలను కాస్త ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది. ఇజ్రాయెల్​ దాడులపై ఐక్యరాజ్యసమితి ఎన్నిసార్లు ఆందోళన, హెచ్చరికలు జారీ చేసినా ‘జాన్త నై’ అనే వద్దకు పరిస్థితులు వెళ్లాయంటే ఈ పరిస్థితికి కారణం ఐక్యరాజ్యసమితి పక్షపాత నిర్ణయాలు కూడా అనే వాదన వినిపిస్తోంది. 
 
టర్కీ, పాక్​ లకు ధీటైన జవాబు..
ఏది ఏమైనా ఈ అవకాశం భారత్​ లోని కాశ్మీర్​ అంశానికి తెరదించేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్​ అంశం ప్రస్తుతం ఏకాకిగా మారింది. ఏ దేశం కూడా కాశ్మీర్​ అంశాన్ని లేవనెత్తినా అది భారత్​ సొంత నిర్ణయమని మిగతా దేశాలు స్పందించడం లేదు. అదే సమయంలో భారత్​ టర్కీ, పాక్​ లకు ధీటైన జవాబిచ్చి ఉగ్రవాదం నిలదీస్తూ నలుగురిలో వారిని నవ్వులపాలు చేస్తోంది. దీంతో కాశ్మీర్​ అంశంపై పాక్​ ఏకాకిలా మారింది. పీవోకే (పాక్​ ఆక్రమిత కాశ్మీర్​)ను ఆక్రమించుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. 
 
యూఎన్​ ను నిలదీయనున్న భారత్​?!..
ఉగ్రవాదంపై పాక్​ పోషిస్తున్న పాత్ర పలుమార్లు బహిరంగంగానే ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పటికీ పాక్​ ను వెనకేసుకొస్తే రేపు ఇజ్రాయెల్​ యూఎన్​ వో నాయకులను నిలదీసినట్లు భారత్​ నిలదీయదన్న గ్యారంటీ లేదు. అన్ని ఆధారాలతో సహా భారత్​ పై జరిగిన దాడుల్లో పాక్​ హస్తం ఉందని, ఇంకా ఆ దేశంలోనే ఆ ఉగ్ర నాయకులు ఉన్నారన్న సమాచారాన్ని యూఎన్​ తో పంచుకుంది. యూఎన్​ కూడా పాక్​ ను ఉగ్రవాదంపై పలుమార్లు నిలదీసినా సిగ్గుయెగ్గు వదిలి మౌనమే సమాధానంగా తప్పించుకు తిరుగుతోంది. 
 
విదేశీ రణనీతిలో భారత్​ టాప్​..
మరోవైపు జమ్మూకశ్మీర్​ లో ప్రధాని మోదీ బలమైన నిర్ణయాలు, అభివృద్ధి, ఎన్నికల నిర్వహణతో పూర్తి బలంగా ఉన్నారు. విదేశీ రణనీతి కూడా పటిష్ఠంగా ఉంది. అదే సమయంలో అంతర్జాతీయ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవోకే అంశం యూఎన్​ లో లేవనెత్తినా పాక్​ కంటే భారత్​ కే ఎక్కువగా మద్ధతు లభించే ఆస్కారం ఉంది. అదీగాక అదీ భారత్​–పాక్​ అంతర్గత సమస్య అని మీరిద్దరే తేల్చుకోవాలని తెలిపే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో మిగిలే ఆప్షన్​ ఒక్కటే ఉంటుంది. పీవోకేను స్వయంగా పాక్​ భారత్​ కు అప్పగించడమూ? లేక అదే ఆర్థికమాంద్యంతో పోరాడుతూ.. అక్కడి ప్రజల ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంటూ అన్ని మూసుకొని కూర్చోవడమో చేయాల్సి ఉంటుంది. అయితే పాక్​ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అదే ఆర్థిక సహాయం. భారత్​ చేతులెత్తేసిన దగ్గరి నుంచి ప్రపంచవ్యాప్తంగా నయాపైసా పుట్టని దేశంగా పాక్​ ప్రపంచంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత్​ ఆర్థిక సహాయం చేస్తే పీవోకేను భారత్​ కు ఇచ్చేందుకు పూర్తి అంగీకారం, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 
 
స్వాధీనమా? ఆర్థిక సహాయమా?..
ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే, ఆపన్నహస్తం అందించే భారత్​ కు పాక్​ అడిగే ఆర్థిక సహాయం ఏమంత ఆర్థిక భారంగా పరిణమించబోదూ. పైగా పీవోకే సమస్యను శాంతిపూర్వకంగా సమసేలా చేసినట్లవుతుంది. దీంతో పీవోకేను భారత్​ దక్కించుకోవడమే గాక ఆ విశాలభూభాగం భారత్​ సొంతమవుతుంది. అక్కడ కూడా అభివృద్ధి ఫలాలు వికసిస్తాయి. ఫలితంగా భారత్​ – పాక్​ ఇద్దరికీ మేలు జరుగుతుంది. ముఖ్యంగా పీవోకే ప్రాంత ప్రజలకు అత్యంత ప్రయోజనం చేకూరుతుంది.