భారత్ కు మొయిజ్జూ?!
Moizzoo for India?!
అక్టోబర్ 7న ప్రధాని మోదీతో భేటీ?
పర్యటన ప్రకటించని మాల్దీవులు
విదేశాంగల చర్చల్లో సమసిన వివాదాలు
డ్రాగన్ హ్యాండీయడంతో భారత్ వైపు అధ్యక్షుడి చూపు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎట్టకేలకు మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ యూటర్న్ తీసుకొని తోవకొస్తున్నారు. అక్టోబర్ 7న ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తొలుత బలం, బలగం, ఆర్థికం అంటూ చైనా మాటలు విని భారత్ తో పెట్టుకున్న మొయిజ్జూకు భారత్ శాంతి పూర్వకంగానే సరైన సమాధానం చెప్పింది. ఆర్థిక సహాయంలో కోత విధించింది. దీంతో కక్కలేక, మింగలేక ఇటీవల పలువేదికలపై మళ్లీ మొయిజ్జూ భారత్ పాట పాడుతున్నారు. ఏది ఏమైతేనేం భారత్ (మోదీ) కోరుకుంటున్న శాంతి, సుస్థిరతల్లో భాగం కావాలని ఉవ్విళూరుతున్నారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సారథ్యంలో ఇటీవల పలుమార్లు భేటీ అయి ఇరుదేశాల మధ్య ఉన్న పొరపొచ్చాలను, సమస్యలను పరిష్కరించుకున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొయిజ్జూ పర్యటనకు మార్గం సుగమమైంది. మొత్తానికి డ్రాగన్ కంట్రీ మాటలు విని భారత్ తో పెట్టుకున్న మొయిజ్జూకు ఆదేశ పన్నాగం ఏంటో తెలిసినట్లుంది. అందుకే భారత్ (ధర్మపథం) వైపు మొగ్గుచూపేందుకే ఇష్టపడుతున్నారు.