1968లో జవాను మృతి శుక్రవారం కేరళలో అంత్యక్రియలు!
The death of a jawan in 1968 will be held in Kerala on Friday!
తిరువనంతపురం: 1968లో మృతి చెందిన భారత జవాను అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. 1968లో కేరళకు చెందిన మలయాళీ చెరియన్(22) ఇండియన్ ఆర్మీలో చేరారు. లేహ్ లో వైమానిక దళ విమానంలో వెళుతుండగా ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి విమానం ఆచూకీ లభించలేదు. అందులో 102 మంది ప్రయాణించారు. 2019 లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహలు 1968 విమాన ప్రమాదానికి సంబంధించినవిగా గుర్తించారు. గత వారం భారత సైన్యం చెరియన్ మృతదేహాన్ని గుర్తించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. శుక్రవారం కేరళకు మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గవర్నర్ పి.ఎస్. శ్రీధరన్ చెరియన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారిక లాంఛనాలతో చెరియన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. చెరియన్ జీవించి ఉంటే ప్రస్తుతం అతని వయస్సు 78యేళ్లుగా ఉండేది.