భారతీయులుగా మార్చే కుట్రకు తెర
అమెరికా ఆర్థిక స్థితిమంతుడుగా గుర్తింపు
1979 నుంచి సంస్థ కార్యకలాపాలు
భారీ కుట్రపై సుప్రీం న్యాయవాది పంకజ్ సింగ్ ఆరోపణలు
స్కాలర్ షిప్, బీదలకు సహాయం, మానవ హక్కుల పేరిట దేశాల్లోకి ఎంట్రీ
గుట్టుచప్పుడు కాకుండా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెర?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ సరిహద్దు రాష్ర్టాల్లో అక్రమ వలసదారులకు ప్రోత్సాహం, వలసదారులను భారతీయులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న కుట్ర తెరపైకి వచ్చింది. మానవహక్కుల సంస్థ ముసుగులో ఈ కుట్రకు పాల్పడుతున్నది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ సంస్థకు చైర్మన్ గా హంగేరిలో జన్మించిన ప్రముఖ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు, తనకు తాను పరోపకారిగా ప్రకటించుకునే జార్జ్ సోరెస్ గా సుప్రీంకోర్టు న్యాయవాది పంకజ్ సింగ్ ఆరోపించారు.
పంకజ్ సింగ్ ఆరోపణల్లో వాస్తవాలు లేకపోలేదు. ఈ సంస్థ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక విషయాలు తేటతెల్లం అవుతున్నాయి. భారత్ లోని ఝార్ఖండ్, లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల వలసలను ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది. అంతేగాక వీరిని స్థానికులుగా మార్చడంలో ఈ సంస్థ కీలకం వ్యవహరిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు ప్రస్తుతానికి ఏవీ లభించలేదని పంకజ్ సింగ్ ఆరోపించారు.
ఈ సంస్థ 120 దేశాలలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా 1979 లో స్థాపించిన ఈ సంస్థ క్రమేణా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. ప్రజాస్వామ్యం, పారదర్శకత, వాక్ స్వాతంత్ర్యం, మానవ హక్కులు పేరిట పనిచేస్తుంది. భారత్ లో 1999 నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది.
ఈ సంస్థ వ్యూహాత్మకత ఆశ్చర్యచకితంగా ఉంది. తొలుత ఈ సంస్థ ద్వారా విద్యలో ఉన్నతులుగా ఉన్న వారినే టార్గెట్ చేస్తుంది. వారికి ప్రోత్సాహకాల పేరుతో ఆ దేశంలో అడుగు పెడుతోంది. అనంతరం వైకల్యాలు, బీదరికం, సంస్కరణలు, న్యాయవ్యవస్థ, మానవ హక్కుల పేరుతో ఆ దేశంలో పూర్తిగా వేళ్లూనుకుంటుంది. ఆ తరువాత ఓపెన్ సొసైటీ అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ ఆయా దేశాల సమగ్రత, సార్వభౌమాధికారాలకు భంగం వాటిల్లేలా చేస్తుంది.
ఇక తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతర్జాతీయంగా ఈ సంస్థ 120 దేశాలలో ఓపెన్ సొసైటీ ద్వారా ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడుతోంది. జార్జీ సోరెస్ అమెరికాలో బడా పారిశ్రామికవేత్తగా పేరుగాంచారు. ఇతనికి ప్రతీ బడా సంస్థలోనూ వాటాలున్నాయి.