దివ్యాంగుల సాధికారతకు కేంద్రం కృషి రాష్ట్రపతి ముర్మూ, ప్రధాని మోదీ

Center's efforts to empower the disabled President Murmu and Prime Minister Modi

Dec 3, 2024 - 17:32
 0
దివ్యాంగుల సాధికారతకు కేంద్రం కృషి రాష్ట్రపతి ముర్మూ, ప్రధాని మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దివ్యాంగుల సాధికారత కోసం కేంద్రప్రభుత్వం వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొదిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని వివరించారు. 33మంది దివ్యాంగులకు సాధికారత సాధన జాతీయ అవార్డులను రాష్ర్టపతి ముర్మూ ప్రదానం చేశారు.

అవార్డు గ్రహీతలు సమాజం ముందు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది దివ్యాంగులు సాధికారత దిశగా ముందుకు వెళ్లాలన్నారు.  దివ్యాంగులలో వ్యవస్థాపకత, వారి నైపుణ్యాలను పెంపొందించడం, వారికి ఉపాధి కల్పించడం వంటి వాటిలో వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు. దీతో దివ్యాంగులలో నాయకత్వ సామర్థ్యాలు కూడా పెంపొందుతాయని తెలిపారు. దివ్యాంగులకు కావాల్సింది సానుభూతి కాదని, వారికి చేయూత, తోడ్పాటు అవసరమని అన్నారు. దీంతో వారిలోని ఆత్మవిశ్వాసం రెట్టింపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాని రాష్ట్రపతి ముర్మూ తెలిపారు.

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని వారికి చేయూతనందిస్తే వారిలోని ప్రతిభను వెలికితీసినట్లవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రప్రభుత్వం చొరవ దివ్యాంగులకు నూతన శక్తినిస్తుందని, వారి సువర్ణ భవితకు పునాదులు వేస్తుందని ప్రధానిస్పష్టం చేశారు.