నాణ్యతాలేమి మందులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

Poor quality medicines are taking people's lives

Sep 27, 2024 - 13:58
 0
నాణ్యతాలేమి మందులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
అన్ని పార్టీలకు ఫండ్​ లు
భోగభాగ్యాలతో విలసిల్లుతున్న బడాబాబులు
మోదీ నేతృత్వంలో కఠిన చర్యలు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఓ వైపు నాణ్యతలేని మందులు విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నారు. ఇంకోవైపు రాజరికపు భోగభాగ్యాలను అనుభవిస్తున్నారు. కానీ ఈ సంస్థలు విక్రయిస్తున్న పలు రకాల మందులను తీసుకుంటున్న రోగులు మాత్రం తమ ఆరోగ్యాలను గుళ్ల చేసుకొని ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అయినా ప్రభుత్వాలు ఈ విషయాలపై ఏం చేస్తున్నట్లు, ఇలాంటి బడాబాబులకే వత్తాసు ఎందుకు పలుకుతున్నట్లు, ఈ ప్రభుత్వాలను ఆ పెద్దమనుషులు ఎలా మేనేజ్​ చేస్తున్నట్లు అనే విషయాలను తెలుసుకుంటూ పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులొకొచ్చాయి. 
 
రాష్​ర్టంలో, దేశంలో అధికారంలోకి వచ్చే, ప్రధాన ప్రతిపక్షం పార్టీలతో బాటు మరికొన్ని పార్టీలకు విపరీతంగా ఈ మందుల సంస్థలు ఫండ్​ ల రూపంలో విరాళాలు చెల్లిస్తున్నాయి. ఇక అంతే అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా తాము ఆడింతే ఆట.. పాడిందే పాటగా చెలమణి అవుతోంది. సామాన్యుడు వేసుకునే పారాసిటమాల్​ కూడా నాణ్యతా ప్రమాణాల్లో విఫలమైందంటే పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్​ రోగాల భారత్​ గా రూపుదిద్దుకునేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 
 
ఒకవేళ ఆయా సంస్థలే అంతగా మంచి నాణ్యత ఉన్న మందులు సరఫరా చేస్తూ, ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు నడుచుకుంటే ఏ పార్టీలకు విరాళాలు ఇయ్యాల్సిన అవసరం ఎందుకు ఉండేది. అంటే ముందుగానే ఒకవేళ తమతో ఏదైనా తప్పు జరిగితే మేనేజ్​ చేయొచ్చని ప్రణాళికలు వేసుకున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 
 
ఇంతకీ అన్ని రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసిన ఆ బడా సంస్థలేంటో తెలుసా? సన్​ ఫార్మా, టోరెంటో ఫార్మాస్యూటికల్స్​, అల్కెమ్​,  హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ లాంటి బడా సంస్థలున్నాయి. ఇదిగో ఇప్పుడు సంస్థల అధినేతలే మార్కెట్లో బడాబాబులుగా చెలామణి అవుతుండడం విశేషం. 
 
కాగా 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక క్రమేణా ఆరోగ్య మంత్రిత్వ శాఖను మరింత పటిష్టం చేశారు. ఈ చర్యతో దేశంలోని ఇప్పటికే అనేక రకాలై పరీక్షలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్​ లోనూ నాణ్యతాలేమి మందులు తయారు చేస్తున్న సంస్థలు, యాజమాన్యాల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన పరీక్షల్లోనే మందుల నాణ్యతాలేమి తేటతెల్లమైంది.