యూపీ జెవార్ లో విమానం సేఫ్ ల్యాండింగ్
Safe landing of plane in UP Jewar
ట్రయల్ రన్ సక్సెస్.. త్వరలోనే ప్రారంభంపై నిర్ణయం
హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
లక్నో: యూపీలోని జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఇండిగో విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. దీంతో ఇక అన్ని విమానాలను ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా నడవాలన్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విమానం ట్రయల్ రన్ సందర్భంగా ఇండిగో విమానం ల్యాండింగ్ కు ఏవియేషన్ ఆఫ్ సివిల్ డైరెక్టరేట్ అనుమతించింది. డీజీసీఎ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం జేవార్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటన్నారు. యూపీలో ఐదో అంతర్జాతీయ విమాశ్రయంగా జెవార్ రూపొందింది. ఈ విమానాశ్రయానికి 2021లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.