ముజఫర్​ పూర్​ లో పట్టాలు తప్పిన గూడ్స్​

నెలలో రెండోసారి ఘటనపై విద్రోహ కోణం? విచారణ చేపట్టిన రైల్వే ఆర్పీఎఫ్​ పోలీసులు

Nov 1, 2024 - 18:48
 0
ముజఫర్​ పూర్​ లో పట్టాలు తప్పిన గూడ్స్​

పాట్నా: బిహార్​ లోని ముజఫర్​ పూర్​ లో గురువారం గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు గురువారం రాత్రి పట్టాలు తప్పాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. పట్టాలు తప్పడం పట్ల విద్రోహ కోణంపై విచారణ చేపడుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో గత నెల రోజుల క్రితం కూడా గూడ్స్​ రైలు పట్టాలు తప్పి ఆరు బోగీలు ప్రమాదపు టంచులో నిలిచాయి. ఈ ఘటన నారాయణ్​ పూర్​ సమీపంలోని అనంత్ స్టేషన్​ లో జరిగినట్లు అధికారులు వివరించారు. నూనె లోడ్​ ను అన్​ లోడింగ్​ చేశాక స్టేషన్​ లో గూడ్స్​ రైలును నిలిపేందుకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే ఇంజనీరింగ్​ విభాగాధికారులు ప్రమాదస్థలానికి చేరుకొని గూడ్స్​ రైలును పక్కకు తప్పించడంలో మిగతా రైళ్ల రాకపోకలు కొనసాగాయి. ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.