జిల్లా అభివృద్ధికి నిధులివ్వాలి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నా తెలంగాణ, సంగారెడ్డి: జిల్లా అభివృద్ధికి సిఎస్సార్ నిధులు ఇవ్వాలని పారిశ్రమికవేత్తలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొని ప్రసంగించారు.
సామాజిక, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్సార్ నిధులు కేటాయిస్తామన్నారు. ఇక్కడ ఉన్న సంస్థలు జిల్లా అభివృద్ధికి సీఎస్సార్ ఫండ్స్ ను తమవంతు భాధ్యతగా రెండు శాతం నిధులను అందజేయాలని దామోదర రాజనర్సింహా సంస్థ ప్రతినిధులను కోరారు. గతంలో నిధులతో చేపట్టిన పనులు వెంటనే పూర్తయ్యేలా సంస్థలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.