నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలోని సప్త ప్రకార యువత శ్రీ దుర్గ భవాని మహాక్షేత్రంలో నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవంలో భాగంగా ఆలయ ధర్మాధికారి రాధాకృష్ణమూర్తి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ శర్మ, దత్తాత్రేయ శర్మలు అమ్మవారికి నూతన వస్త్రాలు పూలమాలలతో అందంగా అలంకరించారు. అమ్మవారు ఇక భక్తులకు దర్శనమిచ్చే పూజలు అందుకున్నారు. ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు. వేడుకల్లో సంగారెడ్డి చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు సిద్దిపేట, మెదక్, హైదరాబాద్, పటాన్ చెరున్చెరు, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన ప్రసాద వితరణ చేపడుతున్నారు.