లింగ నిర్దారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
Strict action against gender determination tests
నా తెలంగాణ, డోర్నకల్: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శుక్రవారం హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు అన్ని స్కానింగ్ సెంటర్లపై నిఘా వేయాలన్నారు. ఎక్కడైనా ఇలాంటి పరీక్షలు జరుగుతుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.