అందుబాటులో నాణ్యమైన విత్తనాలు
Quality seeds available
నా తెలంగాణ, డోర్నకల్: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మహబూబాబాద్ వ్యవసాయాధికారులు శనివారం తెలిపారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో విత్తనాలు లభిస్తాయని రైతులకు వివరించారు. ప్రైవేట్ మార్కెట్ లో కొనుగోలు చేసేకంటే వ్యవసాయ సహఖార సంఘంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్తీ రహిత విత్తనాలనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వానా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరలకు విత్తనాలను అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.