భైంసా ఆర్టీసీ డీఎం సస్పెన్షన్

Bhainsa RTC DM Suspension

Jun 19, 2024 - 14:38
 0
భైంసా ఆర్టీసీ డీఎం సస్పెన్షన్

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డీఎం ఎం అమృతను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రణీత్ అందించిన వివరాల ప్రకారం భైంసా డిపో పరిధిలోని ముధోల్, బాసర బస్ స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. పనులు పూర్తి చేయకుండానే బిల్లులు వేసి తద్వారా వచ్చిన డబ్బును వాడుకున్నారన్నారు. నగర్ జోనల్ ఈడీ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిప్యూటీ ఆర్ ఎం విచారణ అనంతరం డీఎం అమృతను సస్పెండ్​ చేశామని ప్రణీత్​ తెలిపారు.