ఎమ్మెల్సీ కోదండరామ్ కు జర్నలిస్టుల సన్మానం

Journalists honor MLC Kodandaram

Sep 4, 2024 - 18:34
 0
ఎమ్మెల్సీ కోదండరామ్ కు జర్నలిస్టుల సన్మానం
నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా నియమితులైన తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ కు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ నాయకులు అభినందనలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఆయనకు జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ను పూలబొకే, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, నాయకులు తన్నీరు శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, పులిపలుపుల ఆనందం, సీహెచ్ వీరారెడ్డి తదితరులు ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించిన వారిలో ఉన్నారు.