దసరా వేళ ప్రజలు తస్మాత్ జాగ్రత్త -సీఐ శశిధర్ రెడ్డి
People should be careful during Dussehra - CI Sashidhar Reddy
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలు పిల్లలకు సెలవులు ఇవ్వడంతో బంధువుల ఇళ్లకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఊరెళ్లే వారు ముందస్తుగా సంబంధిత స్టేషన్ కు సమాచారం ఇస్తే ఆ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించి, నిఘా పెంచే ఆస్కారం ఉంటుందని అలాగే పోలీసులు తీసుకుంటున్న చర్యలకు తోడు, ప్రజలు సహకరి స్తేనే చోరీల నివారణ సాధ్యమవుతుందన్నారు. పండుగకు ఊరెళ్లే వారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని ఆభరణాలు, నగదు తదితర వస్తువులను వెంటనైనా లేదా బ్యాంకు లాకర్లలో ఉంచడం చేయాలని అన్నాడు. పొరుగు వారికి తమ ఇంటివైపు గమనించాలని కోరాలి. ఏమా త్రం అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు బతుకమ్మ ఆటలో లీనమై ఆభరణాలను కూడా కాస్త గమనిస్తూ ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు లేదా 100 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలి అన్నారు.