సందడిగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
Busy pre-Bathukamma celebrations
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్, ఎస్ఆర్కె, ఆల్ఫాన్సా, సెంట్ జాన్స్ మొదలైన పాఠశాలలు మంగళవా రం ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినులు బతుకమ్మలు తీసుకువచ్చి సంప్రదాయం ఉట్టి పడే పాటలతో బతుకమ్మను ఆడారు.ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల పండుగ నిర్వహించడం మన గొప్పదనం అన్నారు.