ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉజ్వల భవిష్యత్తు

జిల్లా కలెక్టర్ ఆశిష్​ సాంగ్వాన్

Jun 12, 2024 - 17:30
Jun 12, 2024 - 17:34
 0
ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉజ్వల భవిష్యత్తు

నా తెలంగాణ, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తల్లితండ్రులు తమ పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తకాలు, యూనిఫామ్ లు విద్యార్థులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ బడి బాట కార్యక్రమంలో పాల్గొనడం పిల్లలతో కలవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. మన ఊరు మన బడి అన్నప్పుడు మన ఊరిలో ఉన్న ప్రభుత్వ బడిలో మనం చదువుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే ఎక్కువ మార్కులు పొందుతున్నారని అన్నారు. ప్రైవేట్​ పాఠశాలల్లో ఎవరైనా బోధన చేస్తారని, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం  ఎంతో అనుభవం ఉన్న వారికే అవకాశం ఇస్తామని అన్నారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధనరీతి పటిష్టంగా ఉంటుందన్నారు. పదవ తరగతి లో వంద శాతం ఉత్తీర్ణత సాధించటం అభినందనీయమని అన్నారు. డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ మోహిద్, ఎంపీపీ స్వప్న, వైస్ ఎంపీపీ వాల్ సింగ్, విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు  తదితరులు పాల్గొన్నారు.