ఘనంగా బతుకమ్మ వేడుకలు

Grand Batukamma celebrations

Oct 1, 2024 - 20:36
 0
ఘనంగా బతుకమ్మ వేడుకలు


నా తెలంగాణ, నిర్మల్: మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరంలాగే దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందుగా మంగళవారం మహిళలు ఎంతో ఆనందంగా నిర్వహించుకునే బతకమ్మ సంబరాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినిలు ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. బతుకమ్మ సంబరాలు మహిళలకు తెలంగాణ ఉద్యమం నాటి నుండి పెద్ద ఎత్తున రకరకాలైన పూలతో బతకప్పును పేర్చి సంబరాలు నిర్వహించుకోవడం మన సంస్కృతికి నిలయమని ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా ఈ వేడుకలతో నశించిపోతున్న సంస్కృతిని కాపాడాలని పర్యావరణాన్ని కాపాడాలని బతకమ్మ సంబరాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ వేడుకల్లో పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్​, ఉపాధ్యాయురాలు అశ్విని, జాదవ్ లత, కామాటి గంగారాం పాల్గొన్నారు.