ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్లకు ఎమ్మెల్యే భూమి పూజ
MLA Bhumi Pooja for arrangements of open gyms
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: పురపాలక పట్టణం రామకృష్ణాపూర్ 1వ వార్డు తారకరామ కాలనీ,12వ వార్డు గాంధీ నగర్ లో ఓపెన్ జిమ్ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నా రు. త్వరలోనే ఓపెన్ జిమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమనికి హాజరైన ఎమ్మెల్యేను ఆరు గ్యారెంటీల అమలుపై,క్యాతన పల్లి రైల్వే బ్రిడ్జ్ వంతెన పనుల ఆలస్యంపై ఒకటవ వార్డు కాలనీ మహిళలు నిలదీశారు. ఓ మహిళ తనకు గ్యాస్ బిల్లు మాఫీ కాకపోవడంతో సబ్సిడీ డబ్బులు తన ఖాతాలో జమ కావడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుర చైర్మన్ కళ, కౌన్సిలర్లు పొగుల మల్లయ్య, బొద్దుల రమ్య, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.