కార్యకర్తలకు బీఆర్ఎస్ అండ
బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
నా తెలంగాణ, మెదక్: పిడుగుపాటుకు గురై మరణించిన ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ తరఫున ఇన్సూరెన్స్ చెక్కును అందించారు. ఆదివారం ఈ ఇరుకుటుంబాలకు చెందిన రాధమ్మ, బాలమణిలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున రూ. 4 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆపత్కాలంలో ప్రతీ ఒక్క కార్యకర్తను ఆదుకోవడమనే కేసీఆర్ దూరదృష్టి అని తెలిపారు. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, షమ్నాపూర్ మాజీ సర్పంచ్ లింగం, నాయకులు కిషన్ గౌడ్, ఎలక్షన్ రెడ్డి, నవీన్, రాములు, జహంగీర్, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, దుర్గయ్య, కిష్టయ్య గౌడ్, సిద్దయ్య, వినయ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.