దుబాయ్ లో వ్యక్తి మృతి ఆర్థిక సహాయం అందజేత
Man dies in Dubai and provides financial assistance
నా తెలంగాణ, మెదక్: దుబాయిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి సామాజిక సేవా దృక్పథంతో డాక్టర్ మోహన్ నాయక్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం సుల్తాన్ పూర్ తాండకు చెందిన సక్రియా కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సహాయంతోపాటు ఒకనెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. కుటుంబానికి తామున్నామని భరోసానిచ్చి ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీను, , శానిక్ష ఫౌండేషన్ అధ్యక్షులు శివా, శ్రీను, తరుణ్, వినోద్, మంగ్య, రవి, భాస్కర్, భీమ్లా, లచ్చిరం, చందిరం నాయక్ లు, రమేష్ , తండావాసులు పాల్గొన్నారు.