భారతీయులకు నేనే మంచి మిత్రున్ని

మోదీ నాయకత్వంలో భారత్​ దినదినాభివృద్ధి

Sep 15, 2024 - 18:22
 0
భారతీయులకు నేనే మంచి మిత్రున్ని

భారత్​ తో సెకండ్​ ఇన్సింగ్స్​ లో కలిసి పనిచేస్తాం
ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం
అక్రమ చొరబాట్లకే తాను వ్యతిరేకం
భారతీయులు చట్టబద్ధంగానే వస్తున్నారు
రెండుకోట్ల మంది చొరబాటుదారులను తరిమి కొడతా
కమలా హ్యారీస్​ అసత్య ప్రచారాలు
మీడియాతో డొనాల్డ్​ ట్రంప్​


వాషింగ్టన్​ డీసీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్​ దినదినాభివృద్ధి చెందుతోందని, భారతీయులకు తనకంటే మంచిమిత్రుడు లేడని డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భారత్​, భారతీయులపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న సందర్భంగా డొనాల్డ్​ ట్రంప్​, కమలా హ్యారీస్​ లకు భారతీయుల మద్ధతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా భారతీయుల మద్ధతును కూడగట్టడంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రంప్​ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడినైతే భారత్​–అమెరికా సంబంధాలు మరింత బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కమలా హ్యారీస్​ డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో గెలవాలని కుటీల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతీయులకు ఆమె వల్ల మేలు జరగదని ఆరోపించారు. 


భారతీయ అమెరికన్లు తనకు పూర్తి మద్ధతు ప్రకటిస్తారన్న ఆశాభావాన్ని ట్రంప్​ వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో కూడా అనేకమంది భారతీయులు తీవ్రంగా శ్రమిస్తున్నారని వారి ప్రచార శైలిని కొనియాడారు. సెకండ్​ ఇన్నింగ్స్​ లో భారత్​ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అక్రమ వలసదారులపై కఠిన చర్యల్లో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. అదే సమయంలో భారతీయులంతా చట్టబద్ధమైన వలసదారులని తెలుసుకోవాలన్నారు. అలాంటి వారికి తన మద్ధతు ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రాడ్యుయేట్​ అయిన విద్యార్థులు చట్టబద్ధంగా గ్రీన్​ కార్డు పొందవచ్చని తాను ఇదివరకే తెలిపానని అన్నారు. భారతీయులకు ఓపెన్​ డోర్​ పాలసీని అనుసరిస్తానని హామీ ఇచ్చారు.  తాను అధ్యక్షుడినైతే అక్రమంగా చొరబడిన రెండు కోట్ల మందిని వెనక్కి పంపుతానని ట్రంప్​ పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న డెమోక్రాట్లు తనపై ఆరోపణలు చేయడంలో కుటీల రాజనీతి దాగి ఉందన్నారు. కమలా హ్యారీస్​ తనపై అన్నీ అసత్య కథనాలే ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని డొనాల్డ్​ ట్రంప్​ ఆరోపించారు.